నాగ బాబు కామెంట్ నారా లోకేష్ ఈజ్ కరెక్ట్

by | Jan 25, 2019

వరుసగా పొలిటికల్ కామెంట్స్ చేస్తానంటూ నా  ఛానెల్ నా ఇష్టం అంటూ యూట్యూబ్ లో సందడి చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు గారు తన మూడవ వీడియోను కూడా నారా లోకేష్ పై విడుదల చేశాడు.  మూడవ వీడియోలో  నాగబాబు నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. గతంలో నారా లోకేష్ పొరపాటున నోరు జారి చేసిన వ్యాఖ్యలను తీసుకుని నాగబాబు గారు తనదైన శైలిలో పంచ్ వేశాడు.

గతంలో ఒక మీటింగ్ లో  నారా లోకేష్ గారు మాట్లాడుతూ… ఒకటి ఆలోచించండి పొరపాటున కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనం మన ఉరి తీసుకున్న తీసుకున్నటే అవుతుందంటూ వ్యాఖ్యలు చేశాడు. జగన్ వైకాపాకు ఓటు వేస్తే మన ఉరి మనం వేసుకున్నట్లే అనబోయి రివర్స్ లో అన్నాడు. ఆ వ్యాఖ్యలను నాగబాబు ఇప్పుడు తీసుకుని కామెంట్ చేశాడు. లోకేష్ చాలా నిజాయితీగా అమాయకత్వంతో తెలుగు దేశం పార్టీకి ఓటు వేస్తే మన ఉరి మనం వేసుకున్నట్లే  అనే నిజాన్ని చెప్పేశాడు.

అమాయకత్వంతో కొన్ని సార్లు నిజాలు అతడికి తెలియకుండానే వచ్చేస్తున్నాయి. నా మాటలతో మీరు ఏకీభవిస్తారా అంటూ లోకేష్ ప్రశ్నించాడు. ఖచ్చితంగా ఒప్పుకుంటాం మీరు అన్నదాంటో నూటికి నూరు శాతం నిజం ఉంది. లోకేష్ బాబు ఈజ్ రైట్ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబందించిన వీడియో యూట్యూబ్ లో ఇపుడు ట్రెండింగ్ లో ఉంది.

https://youtu.be/cFAtj2g7wXY