స్వీపర్ పోస్టుకు ఎంబీఏ – బీటెక్ గ్రాడ్యుయేట్లు

by | Feb 7, 2019

దేశంలో నిరుద్యోగం స్థాయి ఎంత ప్రమాదంలో ఉందో తెలియజెప్పే సంఘటన తాజాగా తమిళనాడులో కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు వందలున్నా.. లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. చదివిన చదువు  ఎంత పెద్దది అయినా సరే.. ప్రభుత్వ కొలువులో స్వీపర్ ఉద్యోగాలకు పీహెచ్డీ చదువు చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తాజాగా తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్ లో స్వీపర్ -సానిటరీ కార్మికుల ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎంటెక్ – బీటెక్ – ఏంబీఏ – పోస్టు గ్రాడ్యుయేట్లు – గ్రాడ్యూయేట్లు నుంచి వందల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వీరితోపాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాదు.. డిప్లమో పొందిన వారు కూడా స్వీపర్ పోస్టులకు పోటీపడడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.