పుల్వామా లో 40 మంది CRPF జవాన్లమీద ఉగ్రవాదులు దాడి చేసారు. అయితే ఆ దడి కి సమాధానంగా భారత్ చేసిన బాలాకోట్ దాడి లో చాల మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ తమకు ఎలాంటి నష్టం జరగలేదని, భారత్ ప్రకటనను నిరాకరించింది . కానీ తమ దేశం లోపలికి వచ్చి దాడిచేయడం సరి కాదు అని, భారత్ దేశం పై విరుచుకు పడింది .
నిన్న జమ్మూ కాశ్మీర్ లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇరువైపులా దేశాలు చెరొక విమానాన్ని కోల్పోయారు. అయితే భారత్ దేశానికీ చెందిన మిగ్ 21 ఫైటర్ ప్లేన్ పైలట్ అభినందన్ వర్తమాన్ , వారి చేతుల్లో చిక్కుకున్నారు.
మొదట అభినందన ను చితక బదిన గ్రామస్తులు, తరువాత పాకిస్తాన్ సైనికులకు అప్పచెప్పారు. ఆయనను బాగా చూసుకుంటున్నారు అని వీడియో తీసి ప్రపంచానికి తెలిసేలా సోషల్ మీడియా లో ఆ వీడియో ను విడుదల చేసారు.
భారత్ మాత్రం, తన పైలట్ ను వెంటనే విడుదల చెయ్యాలని, లేకపోతే యుద్ధనికి సిద్ధం అవ్వమని చెప్పడం జరిగింది. అమెరికా, రష్యా, చైనా దేశాలనుంచి కూడా వత్తిడి రావటం తో, పాకిస్తాన్ రేపు అభినందన్ ను విడుదల చేస్తాం అని ప్రకటించింది.