యురోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలి అని యూకే ప్రజలు 2016 డిసెంబర్ లో ప్రజాభిప్రాయం లో తెలిపారు. బ్రిటన్ ప్రధాని తెరెసా మే, ఆ ప్రజాభిప్రాయం ను పరిగణించి, బ్రిటన్ ను యురోపియన్ యూనియన్ నుంచి బయటకి తీసుకుని రావటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మార్చ్ 29 నుంచి బ్రిటన్, EU లో తన సభ్యత్వం ఉండదు అని నిర్ణయించింది.
కానీ, నిన్న జరిగిన బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలలో, బ్రే-ఎగ్జిట్ ప్రతిపాదన ఒక కొత్త మలుపు తీసుకుంది. బ్రిటన్ పార్లమెంట్ లో హౌస్ అఫ్ కామన్స్ వారు 432 – 202 ఓట్ల తో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. EU నుంచి బయటకు వచ్చినా, ఆంక్షలు, వాణిజ్య ఒప్పందాలలో మార్పులు పెద్దగా కనిపించక పోవడం ఒక కారణం, అని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ తిరస్కారం ఆధారంగా, ప్రతిపక్షం వారు ఈ బుధవారం నాడు అవిశ్వాస తీర్మానాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. తెరెసా మే కానీ తన మెజారిటీ ని చూపించలేక పోతే, బ్రిటన్ సాధారణ ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది.
ఇక బ్రిటన్ తన ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తుందా, లేక రాజకీయాలకు పట్టం కడుతుందా అని వేచి చూడాల్సిందే.