“KCR, KTR ల వాగ్బాలం, కాంగ్రెస్ ఓటమికి కారణం” – కాంగ్రెస్ :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారు ఈ మధ్య, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఓటమి కి గల కారణాలను పరిశీలించారు. రాహుల్ గాంధీ తో భేటీ అయ్యి, ఆ కారణాల గురించి చర్చించుకున్నారు అని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ఓటమికి తెలుగు దేశం పార్టీ కానీ, చంద్ర బాబు గారు కానీ కారణం కాదు అని వివరించారట.

అసలు కారణం,  కేసీర్ మరియు కేటీఆర్ ల వాగ్బాలం అని తెలుసుకున్నారు.

అయితే వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని మార్చాలని పలువురు అభిప్రాయపడ్డారు . తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (TPCC) అధ్యక్షుడు, ఉత్తమ్ రెడ్డి గారిని మరియు AICC  తెలంగాణ ప్రధాన కార్యదర్శి RC ఖుంటియా ను కొనసాగించాలని చెప్పడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కి మంచి నాయకులను నియమించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిసింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »