మా ఆవిడ తలుపు తీయలేదు..?
సుబ్బారావు: రాత్రి తాగి, లేటుగా వెళ్లినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు.. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా..
చింటూ: మరి తెల్లారిన తరువాత తీసిందా..?
సుబ్బారావు: లేదురా.. తాగింది దిగింది.. అప్పుడే గుర్తుకు వచ్చింది.. నాకసలు పెళ్లికాలేదని..
తాళం నా జేబులోనే ఉందని..
ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది..?
తండ్రి: ఎవర్రా.. నా జేబులో డబ్బులు తీసింది..
కొడుకు: నేనే నాన్నా…
తండ్రి: ఏరా.. అంత ధైర్యంగా చెబుతున్నావు.. వీపు చీరేస్తాను భడవా..
కొడుకు: అమ్మే తియ్యమంది నాన్నా.. అమ్మా చూడవే.. (కిక్కురు మనలేదాయన)
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
వెంగళప్ప పుట్టిన కొడుకును చూడడానికి హాస్విటల్‌కు వెళ్ళాడు..
డాక్టర్: రండి సార్.. మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..
వెం: ఆ ఊరుకోండి డాక్టర్ గారు.. మీరు ఏ అబ్బాయి నైనా అంతే అంటారు..
డాక్టర్: లేదండీ మీ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు..
వెం: అలాగా మరి అబ్బాయి అందంగా లేకపోతే ఏమంటారు..?
డాక్టర్: ఏముందీ.. అబ్బాయి అచ్చు మీలాగే ఉన్నాడు సార్.. అంటాం..