అంతా దేవుడి దయ…?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ…
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి…
నన్ను పెళ్లి చేసుకుంటావా..?
అబ్బాయి: నన్ను పెళ్లి చేసుకుంటావా..?
అమ్మాయి: ఏం చూసి పెళ్లి చేసుకోవాలి నిన్ను..
అబ్బాయి: మా ఊర్లో మా నాన్నే అందరికంటే పెద్ద..
అమ్మాయి: అయితే ఓకే..
పెళ్లి తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది ఏంటంటే..
ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వయసు 105 ఏళ్లు..
ఊర్లో అందరికంటే పెద్దవాడు అని..
పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం…?
సీత: మీ ఇంట్లో బోరింగ్ పంప్ వేయించుకున్నారటగా.. వదినా..
పంకజం: ఆ… అవును త్వరలో పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం కదా.. అందుకనే..
సీత: ఏంటీ..!
పంకజం: ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు కానీ.. వెళ్ళు వెళ్ళు..