మాస్ రాజా రవితేజ లగ్జరీ కార్స్ కాస్ట్ తెలిస్తే!

by | Jan 28, 2019

టాలీవుడ్ లో టాప్ హీరోలంతా ఖరీదైన హై ఎండ్ కార్స్ ని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అందరి హీరోలతొ పోటీపడుతూ   మాస్ మహారాజా రవితేజ మెయింటెయిన్ చేస్తున్న లగ్జరీ కార్స్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్.

రవితేజ రెగ్యులర్ గా ఉపయోగిస్తున్న రేంజ్ రోవర్ ఎవోక్ విలువ అక్షరాల రూ.63.82 లక్షలు ఉంటుందట. అలాగే రూ.1.24 కోట్లు వెచ్చించి బీఎండబ్ల్యూ ఎం6 కారును సొంతం  చేసుకున్నాడు. వీటి తో పాటు  వీటన్నిటి కంటే కాస్ట్ లీగా మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ రవితేజ వద్ద ఉంది. దీని విలువ రూ.2.43  కోట్లు. ఈ మూడు కార్లను సందర్భాన్ని బట్టి రవితేజ ఉపయోగిస్తుంటారు.
మాస్ మహారాజా రవితేజ  నటించిన గత చిత్రం `అమర్ అక్బర్ ఆంటోని` బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈసారి కథలపై చాలా జాగ్రత్త వహిస్తున్నారట. తాజాగా ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై `డిస్కో రాజా` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే రవితేజ పుట్టిన రోజు సందర్బంగా లాంచ్ చేసిన టైటిల్ కి అభిమానుల్లో అద్భుత స్పందన వచ్చింది. రవితేజ కెరీర్ కి ఎంతో ఇంపార్టెంట్ చిత్రమిది.