హీరోగా మారిన టాలీవుడ్ విలన్

by | Jan 31, 2019

ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన శ్రవణ్ రాఘవేంద్ర నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. స్టైలిష్ విలన్ గా పలు చిత్రాల్లో కనిపించిన శ్రవణ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. విలన్స్ గా నటించిన ఎంతో మంది నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  ఇప్పుడు శ్రవణ్ రాఘవేంద్ర కూడా హీరోగా తన లక్ ను పరీక్షించుకోవాలని హీరోగా ఒక చిత్రం చేస్తున్నాడు.

ఈమద్య కాలంలో చిన్న బడ్జెట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అందుకే అలాంటి నేపథ్యంలోని సినిమానే శ్రవణ్ రాఘవేంద్ర చేస్తున్నాడు. ‘ఎదురీత’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ ప్రపంచంలో కొడుకు మాత్రమే కలిగి ఉన్న ఒక తండ్రి ఆ కొడుకును అత్యంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అంతగా కొడుకుపై ప్రేమను చూపించే తండ్రి ఒకానొక సందర్బంలో ఇబ్బందుల్లో పడతాడు. ఆ ఇబ్బందులు ఏంటీ ఆ సమయంలో అతడి కొడుకు పరిస్థితి ఏంటీ ఒక తండ్రి కొడుకు గురించి పడే ఆవేదనను ఈ చిత్రంలో చక్కగా చూపించనున్నారట.

తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తప్పకుండా సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులకు నచ్చుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తుంది.