కారు గిఫ్టు నిజం కాదా ?

by | Feb 4, 2019

ఊహించని రేంజ్ లో టాప్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలుస్తున్న ఎఫ్2 విడుదలై ఇరవై రోజులు దాటుతున్నా చాలా చోట్ల స్టడీ కలెక్షన్లు రాబడుతూనే ఉంది. తనకు పోటీగా సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలు ఒక్కొక్కటి చాప చుట్టేయగా తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోవడంతో వీకెండ్స్ లో మళ్ళి ఎఫ్2నే పికప్ అయినట్టుగా ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఇచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకు లేదు.

అందులోనూ దిల్ రాజు బ్యానర్ లో ఇదే పెద్ద హిట్ గా నిలిచింది. 75 కోట్ల షేర్ కు చేరువలో ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం పట్ల దిల్ రాజు ఆనందం మాములుగా లేదు. అయితే ఆ ఖుషిలో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బిఏండబ్ల్యు కారు గిఫ్ట్ గా ఇచ్చాడనే వార్త గుప్పుమంది. ఇంకేముంది గాలి కన్నా వేగంగా ఇది ప్రచారం అయిపోయింది. ఇలాంటి కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం ఇండస్ట్రీలో కామనే కనుక అందరూ నిజమనే నమ్మారు. అయితే షాక్ ఏంటంటే అలాంటిది ఏమి జరగలేదట. అనిల్ రావిపూడి దగ్గర అతని సన్నిహితులు ఈ ప్రస్తావన తెస్తే వినడానికి బాగానే ఉందని దిల్ రాజు నిజం చేస్తే ఓ పనైపోతుందని నవ్వుతు కామెంట్ చేసినట్టు టాక్. సో ఎఫ్2 సక్సెస్ గుర్తుగా దిల్ రాజు కారు ఇచ్చిన మాట నిజం కాదని తేలిపోయింది.

ఇప్పుడీ విజయానందాన్ని ఆస్వాదిస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బయటికి చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే ఉండొచ్చనే టాక్ ఉంది కాని ఖచ్చితమైన బయటికి రావడానికి ఇంకొంత టైం పట్టేలా ఉంది. రంగస్థలం-భరత్ అనే నేనుల తర్వాత జెన్యున్ గా అర్ధ శతదినోత్సవం జరుపుకోబోతున్న మూవీగా ఎఫ్2 నిలవబోతోంది. సెంటర్ల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి