ప్రైమ్ లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అంటే బోరింగ్ పాట కానీ సీన్ గానీ వచ్చినప్పుడు సీన్ ని కాస్త ముందుకు నడిపించి చూస్తాం అదే టీవీ అనేసరికి కుదరదు కదా
నిన్న నాలుగు భాగాలుగా చేసి” హేలో గురు ప్రేమ కోసేమే “అనే సినిమా చూసేను …. ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా ఎక్కువ అయినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయి తెలుగు సినిమాలు తీయాలంటే చాలా ఈజీ పాత సీడీ లు పెట్టుకుని కొన్ని సినిమాలు చూస్తే సరి కుప్పలు కుప్పలు ఐడియాలు వస్తాయి
కధ…..
పులిహోర ఇష్టం కదాని రోజూ పెట్టిన పులిహోరే పెడితే ఎలా ఉంటుందో అలాగే అరగిపోయిన స్టోరీ నే చిన్న చిన్న మార్పులు చేసి కొత్త కాన్సెప్ట్ అంటూ మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు ….. . సాధారణంగా అమ్మాయి ప్రేమ కోసం ప్రేమికుడు ట్రై చేస్తుంటే తండ్రి అడ్డం పడుతుంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ తండ్రి , హీరో మధ్య ఫ్రెండ్ షిప్ అనే లంకె వేసి ఈ కథని ముందుకు నడిపించడంతో తెలియకుండానే ఎప్పటికప్పుడు ఏమి అవుతుందో అన్న ఆసక్తి మొదలు అవుతుందని అనుకున్నారు కానీ అలా అనిపించలేదు
నటీనటులు….
భ్రమోత్సవం సినిమాలో లాగే ప్రణీత ఆమె తండ్రి పాత్రలో సురేష్ ఇద్దరిది ఈ సినిమాలో కూడా ఆట లో అరటిపండు పాత్రలే ….. అను తల్లిగా ఆమని మాట్లాడే బట్లర్ ఇంగ్లిష్ కోసమే ఆమె ఉన్నారు ….. రామ్ ప్రకాష్ రాజ్ అనుపమ కోసమే సినిమా అన్నట్టు ఉంది ….
నవ్వొచ్చే సీన్ లు :😢😢
ఓ మధ్య తరగతి తండ్రి గా కూతురికి మెడిసిన్ చదివించలేక ఇంజనీరింగ్ చదివిస్తాడు అటువంటిది ప్రైమ్ లోకాలిటీ లో డూప్లెక్స్ ఇల్లు కొంటాడు కూతురు సంతోషంగా ఉండాలిని ….. హౌ???
రామ్ తల్లిగా నటించిన సితార ప్రకాష్ రాజ్ ఫ్రెండ్స్…..హైదరాబాద్ లో ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉండమని పంపిస్తుంది రాం ని మరి
అనుపమ పరమేశ్వరన్ రాం కాకినాడ నుంచి ఒకే ట్రైన్ లో
ప్రయాణిస్తున్న ట్టు చూపించారు …. మరి ప్రకాష్ రాజ్ చెప్పాలి కదా ఒకసారి నా ఫ్రెండ్ అక్కడే వుంది కలసి రా అని
ప్రణీత తో కాఫీ షాప్ కి వొచ్చి బిల్ కట్టలేక అను సహాయం తీసుకుంటాడు రామ్ మొబైల్ ఆప్ నుంచి ola క్యాబ్ బుక్ చేస్తాడు ….. అటువంటిది ఈరోజుల్లో అంత స్మార్ట్ స్టైలిష్ హీరోకి ఒక “పే టి ఎం ” ఆప్ లేకపోవడం ఏంటో
ప్రణీత కి ఎందుకు బ్రేకప్ చెప్పాడో ఆమో ఒక్క తిట్టు తిట్టకుండా జాబ్ రిజైన్ చేసి వెళ్లిపోవడం బహుశా ఎడిటింగ్ లో పోయి ఉంటాయి ……
పాటలు : సందర్బం లేని వి తెలుగు సినిమాలో ఎప్పుడు ఉన్నదే
క్లయిమాక్స్: తెలుగు హిందీ సినిమాల్లో ఒక బకార పెళ్ళికొడుకులు ఉంటారు ఈ సినిమాలో కార్తీక్ ఒక సీన్ లో కనిపిస్తాడు తరవాత యూ స్ కి పోతాడు తరవాత కనిపించడు …. ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగిల్చాలకున్నారు ఏమో ప్రకాష్ రాజ్ మాట మీద నిల్చుని క్లయిమాక్స్ త్వరగా ముగించేశారు ……. ఆమని కూడా ఎం అనకుండా పెళ్లికి ఒప్పుకుంటుంది చివర్లో అందరి మోహల్లో చిరునవ్వులు
హైద్రాబాద్ లాంటి ఊర్లో వారం రోజుల్లో పెళ్లి ఎంగేజ్మెంట్ కాంసీల్ అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని ….అయిన నాకెందుకు దిల్ రాజు గారు కదా ప్రొడ్యూసర్