వణుకుతున్న భారతదేశం – కారణం ఇదట !

by | Jan 30, 2019

గత నాలుగు రోజులుగా భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈ ఆకస్మిక చలికి కారణం ఆర్కిటిక్ ప్రాంతంలో జరిగిన కొన్ని పేలుళ్ళట.  డిసెంబర్ నెలలో జరిగిన ఈ పేలుళ్ల వల్ల చలి గాలులు అమెరికా మరియు యూరోప్ మీదుగా భారతదేశాన్ని తాకుతున్నాయని భారతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావం వాల్ల అమెరికాలో, యూరోప్ లో  ఆకస్మిక మంచు వర్షాలు కురుస్తున్నాయని సమాచారం.

అయితే  ఇలాంటి గాలులు ప్రతి సంవత్సరం నాలుగు-ఐదు సార్లు రావడం సహజమే అని అన్నారు. కానీ ఈ సంవత్సరం ఏకంగా ఏడు సార్లు రావడంతో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది అని తెలియజేసారు.

ఈ గాలుల ప్రభావం ఇంకో రెండు మూడు రోజులు ఉంటుంది అని చెప్పారు.