రవితేజ పుట్టినరోజు సందర్భంగా “డిస్కో రాజా” పోస్టర్ రిలీజ్

by | Jan 26, 2019

ఈరోజు రవితేజ తన 51వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా “డిస్కో రాజా” నిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ఈ చిత్రం లో పాయల్  రాజపుట్ మరియు నాభా నతీష్ కధానాయికలు గా కనిపించనున్నారు.

“డిస్కో రాజా” సినిమా ను రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. వై ఆనంద్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ – రామ్ తాళ్లూరి కలిసి ఇదివరకు వచ్చినా “నెల టికెట్” సినిమా మొదటిసారి పనిచేసారు. ఇది వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా రెండో సినిమా.

సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే, ఈ సినిమా లో  ఒక సైన్స్ ఫిక్షన్ కోణం కూడా కనిపిస్తుంది అని కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. ఇది “మాస్ మహారాజ” రవి తేజ ఫాన్స్ కి ఒక శుభవార్తే.