ప్రతి వ్యాపారస్తుడు చదవ వలసిన పుస్తకాలు

by | Apr 18, 2020

ప్రతి వ్యాపారస్తుడు చదవ వలసిన పుస్తకాలు:

కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతోంది. ప్రతి వ్యాపారస్తుడు ఆలోచన విధానం “ప్రపంచం ఎం అవుతుందో” “మన వ్యాపారం ఆగిపోయింది ఇప్పుడు ఏంచెయ్యాలి” అని ఆలోచనలు చేస్తున్నారు. కొంత మంది, వార్తలు చూసి ఎం చెయ్యలేక అలా ఆగిపోతున్నారు. అయితే, వ్యాపారం మీద ఒక లక్ష్యం ఉన్నవాళ్ళ ఆలోచనలు చాల భిన్నంగా ఉంటాయి.

జీవితం లోను వ్యాపారం లోను గెలవాలని కృషి చేసేవాడికి, కరోనా ఒక అవకాశం, ఒక గొప్ప వరం. వ్యాపారం లో ఇప్పటిదాకా ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి, లాక్ డౌన్ ముగిసాక తాము చెయ్యవలసిన పనులు, మార్కెట్ ని ఎలా ఎదురుకోవాలి అనీ ఆలోచనలతో నిండి ఉంటోంది.

ఇటువంటి సమయం లో గెలవాలని తాపత్రయ పడుతున్నవారికోసం, మేము రాసిన చిన్న వ్యాఖ్యానం ఇది. ఈ సమయాన్ని వృధా చెయ్యకుండా, మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

వ్యాపారం లోను, జీవితం లోను గెలవటానికి కావలసింది కృషి, జ్ఞానం మరియు సంకల్పం. వీటిలో ఏది లోపించినా, మనం గెలుపు కి దూరంగా వెళ్తుంటాము. ఈ విషయాల మీద అవగహన తెచ్చుకోవటానికి, ఈ లాక్ డౌన్ సమయం లో మీరు చదవవలసిన మూడు పుస్తకాలూ ఇవి:

౧. రిచ్ డాడ్, పూర్ డాడ్ – రాబర్ట్ కియోసాకి:

రాబర్ట్ కియోసాకి అమెరికా దెగ్గర ఉన్న హవాయి అనే దేశం లో పుట్టారు. అయన నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. అయితే, ఆయన నాన్నగారు, అమ్మగారు డబ్బు గురించి మాట్లాడే మాటలు విని, ఆయనికి డబ్బులు సంపాదించటం ఆంటీ చాల కష్టమేమో అని అనిపించేది. అతని స్నేహితుని తండ్రి చాల ధనికుడు. చిన్న వయసులోనే డబ్బులు గురించి అవగాహనా తెచ్చుకోవాలి అని అయన చెప్పే వారట. డబ్బు మీద మనకి చిన్నప్పుడే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయాన్ని మనం జీవితాంతం మోస్తాం. కానీ ఆ అభిప్రయం యొక్క ఉనికి తేలుకుంటే మనం ఆశ్చర్య పోతాం. రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తకం మన ఉనికి ని కదిలించి మన ఆర్ధిక జ్ఞానాన్ని పెంచీ ప్రయత్నం చేస్తుంది. ప్రతి వ్యాపారస్తుడు చదవ వలసిన పుస్తకం ఇది.

ది సీక్రెట్ – రఁహొండా బైర్నే

రఁహొండా బైర్నే ఆస్ట్రేలియా దేశస్తురాలు. ఆమె జీవితం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒకానొకప్పుడు ఆమెకు జీవితం మీద ఆశ చనిపోయింది. అటువంటి సమయం లో ఆమీ ఒక పుస్తకం తారసపడింది. ఆమెను పలు ఆలోచనలకూ గురిచేసింది. మనిషి పేదవాడిగా ఎందుకు జీవిస్తాడు, కొంతమంది ఎందుకు ధనికులు అవ్వగలరు? రహస్యం ఏమిటి? కొంత మంది మాత్రమే అందనం గ జీవిస్తారు, మరికొంత మంది ఎందుకు ఆనందం గా జీవితాన్ని అనుభవించలేకపోతారు? కారణం ఏంటి? ఎలాంటి ప్రశ్నలకి సమాధానం కావాలంటే “ది సీక్రెట్” తప్పక చదవాల్సిందే.

థింక్ అండ్ గ్రో రిచ్ – నేపాలీన్ హిల్

థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం చూసినప్పుడు, ఆలోచనల తో ఎవరైనా డబ్బు ఎలా సంపాదించగలరు? అసలు ఎం ఉంది ఈ పుస్తకం లో? ఎం రాసారు అనీ కుతూఉహలతో ఈ పుస్తకం చదవటం మొదలు పెట్టాను. కానీ చదివీ కొద్దీ, తెలియని విషయాలేంనూ తెలుసుకున్నాను. మనిషి ఆలోచనల్లో ఉన్నా శక్తి గురించి తెలుసుకున్నాను. పెద్ద వాళ్ళు “గొప్పగా ఆలోచించాలి” అని అనేవారు..ఆ గొప్ప ఆంటీ ఏంటో ఈ పుస్తకం చదివాకా అర్ధం అయ్యింది. ఒక ఆలోచన మన నడకను ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఈ పుస్తకం చదివితే అర్ధం అవుతుంది. అందుకే గొప్పవాళ్ళ ఆలోచనలు గొప్పగా ఉంటాయి.